
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అంబరాన్నంటే ఉత్సాహంతో జరుపుకున్నారు భారతీయులంతా. ఎర్రకోటఫై జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలోనూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
టి.డి.పి కార్యాలయంలో చంద్రబాబు, పి.ఆర్.పి కార్యాలయంలో చిరంజీవి, టి.ఆర్.ఎస్ కార్యాలయంలో కే.సి.ఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్కూళ్ళలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, కార్పొరేట్ ఆఫీసుల్లోనూ జాతీయ జెండా ఆవిష్కరణతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలతో, త్రివర్ణ పతకాల ఆవిష్కరణలతో, దేశ భక్తి గీతాలతో పండగ వాతావరణం నెలకొంది.
No comments:
Post a Comment