లోక్ సత్తా పార్టీలో మొదటి సారి అసమ్మతి భగ్గుమంది. ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) వైఖరిని దొమ్మాట వెంకటేశం, పార్టీ అధికార ప్రతినిధి మరియు తెలంగాణ ఇంచార్జి, తప్పుపట్టారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, జన రాజకీయం పేరుతో ధన రాజకీయం చేస్తున్నాడని అసమ్మతి వర్గం ఆరోపించింది. 13 ప్రశ్నలతో వారు జేపీకి బహిరంగ లేఖ రాసి 24 గంటలలో వాటికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేసారు.
అవినీతిరహిత సమాజాన్ని స్థాపిస్తామన్న జేపీ మొన్న జరిగిన ఎనికల్లో టికెట్లను అమ్ముకున్నారని, పార్టీ కార్యాలయాన్ని కమ్మ కుల సంఘం కార్యాలయంగా మార్చారని వారు ఆరోపించారు. కూకట్ పల్లి నియోజికవర్గాన్నే ఎన్నుకోవడంలో ఆంతర్యమేమిటని, చిత్తసుద్ధి వుంటే ఇప్పటివరకు వచ్చిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాలన్నారు.
పార్టీ ఉపాధ్యక్షుడు ఆకురాతి మురళీకృష్ణ, జిల్లా నాయకులు వెంకటరాజు, లింగ్యానాయక్, పి.రాజేందర్ రెడ్డి, పి.లక్ష్మణ్ రావు, సైదులు, చక్రవర్తి తదితురులు ఈ అసమ్మతి వర్గంలో ముఖ్యులు. సొంత పార్టీలో జేపీఫై విమర్శలు రావడం ఇదే మొదటిసారి. ఈ సంఘటనఫై జేపీ స్పందించాల్సి ఉంది.
Friday, July 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment