భారత బ్యాడ్మింటన్లో గురు శిష్యులు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ లకు దేశ క్రీడారంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలు దక్కాయి. బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్, ప్రస్తుత కోచ్ పుల్లెల గోపీచంద్ కి "ద్రోణాచార్య" అవార్డు లభించగా.. సంచలనాల సైనాకి "అర్జున" అవార్డు లభించింది. ఈ తెలుగు తేజాలకు (Ideal Andhrites) Ideal Andhra శుభాకాంక్షలు తెలుపుతుంది.
మొత్తం ముగ్గురు క్రీడాకారులకు 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న', నలుగురు కోచ్ లకు 'ద్రోణాచార్య', 15 మందికి 'అర్జున', ఇద్దరికి 'ధ్యాన్ చంద్' అవార్డులు లభించాయి.
అవార్డుల విజేతలు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
మెరీకామ్(బాక్సింగ్), విజేందర్ సింగ్(బాక్సింగ్), సుశీల్ కుమార్(రేజ్లింగ్)
ద్రోణాచార్య
పుల్లెల గోపీచంద్(బ్యాడ్మింటన్), బల్దేవ్ సింగ్(హాకీ), జైదేవ్ బిస్త్(బాక్సింగ్), సత్పాల్ సింగ్(రెజ్లింగ్)
అర్జున
సైనా నెహ్వాల్(బ్యాడ్మింటన్), మంగళ సింగ్ (ఆర్చెరీ), సినిమోల్ పౌలోస్ (అధ్లెటిక్స్), సరితా దేవి(బాక్సింగ్), తానియా సచ్దేవ్(చెస్), గౌతం గంభీర్(క్రికెట్), ఇగ్నేస్ టర్కీ(హాకీ), సురీందర్ కౌర్(హాకీ), పంకజ్ శిర్సాత్(కబ్బడి), పారుల్ దిపర్మార్(బ్యాడ్మింటన్ - అంగవైకల్య విభాగం), సతీష్ జోషి(రోయింగ్), రంజన్ సోది(షూటింగ్), పౌలోమి ఘటక్(టిటి), యోగేశ్వర్ దత్(రెజ్లింగ్), జిఎల్ యాదవ్(యాచింగ్)
ధ్యాన్ చంద్
ఇషార్ సింగ్ డియోల్(అధ్లెటిక్స్), సత్భీర్ సింగ్ ధహ్హ్య(రెజ్లింగ్)
విజేతలందరికీ శుభాకాంక్షలు...
No comments:
Post a Comment