ఇప్పుడు అకస్మాతుగా జూనియర్ మందు పార్టీ వీడియో ఇంటర్నెట్ లో దర్శనమిస్తుంది. Youtube సైటులో ఉన్న ఈ వీడియోని ప్రముఖ న్యూస్ ఛానల్ I-News దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ భాగోతం ప్రమాదానికి గురైన రోజు జరిగిందేనని ప్రచారం చేసింది. ఈ వీడియోలో జూనియర్ తన స్నేహితులతో కలిసి మందు కొడుతూ పాటలు పడుతున్నాడు. "రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే" అని జూనియర్ రాగం తీస్తుంటే, తన స్నేహితులు టేబుల్ మీద మద్దెల దరువు వేస్తున్నారు. జూనియర్ కి సన్నిహితుడైన రాజీవ్ కనకాల కూడా ఈ వీడియో లో వున్నాడు. తను కూడా ప్రమాదం జరిగిన కారులో వుండడం గమనార్హం.
కాగా, ఈ విషయాని రాజీవ్ కనకాల తోసిపుచాడు. ఈ వీడియో ప్రమాదం జరిగినప్పటిది కాదు అని, అప్పట్లో తన జుట్టు పొడువుగా వుండేదని, వీడియోలో అలా లేదని చెప్పాడు. టి.డి.పి వర్గం కూడా ఆ వీడియోలో ఉన్న జూనియర్ చొక్కా, ప్రమాదం జరిగినప్పుడు జూనియర్ వేసుకున్న చొక్కా ఒకటే కాదని, ఈ వీడియో ఒక సంవత్సరం ముందు తీసిందని తోసిపుచ్చింది.
జూనియర్ మందు తాగడం విశేషం కాదు, మందు తాగి ఆక్సిడెంట్ చెయ్యడమూ విశేషం కాదు. కాని ఇప్పుడు ఆ వీడియో ని ప్రచారం చెయ్యడం ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రచారం వెనుక ఎవరి "హస్తం" ఉంది? గ్రేటర్ ఎన్నికల ముందు ఇలాంటివి బయటకి వస్తే ఎవరికి ఉపయోగముంది? ఇవ్వనీ సగటు ఓటరుకి అర్థమయ్యే విషయమే. కాని జూనియర్ అభిమానులు దీన్ని జీర్నిన్చుకోవలసి ఉంది.
వీడియో లింక్: http://www.youtube.com/watch?v=XOjMyzV0Ulo
----------------------------
[Update] Youtube has removed this video from its website.
No comments:
Post a Comment